Friday 18 December 2015

Police Proceedings in POCSO Act-2012



From: Macharara Raju [mailto:macharajum@gmail.com]
Sent: 12 December 2015 18:13
To: anand@helpap.in; pavan@helpap.in
Subject: About Pocso Cases Police Proceedings

నమస్కారం 
సర్
 పోక్సో  యాక్ట్  క్రింద నమోదైన  కేసుల  విషయంలో పోలీసు వారు చేయదగిన అంశాలు ఏమిటి?

మీ ప్రశ్నకు సమాధానం:
POCSO చట్టం అనేది బాలలపై లైంగిక దాడులకు సంభందించిన నేరాల నుండి రక్షణ కల్పించేందుకు, వీటికి సంబంధించిన ఇతర వివరాలతో సహా రూపొందించబడిన సమగ్రమైన చట్టం. పోక్సో యాక్ట్ (బాలలపై లైంగిక  నేరాల నుండి బాలలను రక్షించే చట్టం) క్రింద నమోదైన  కేసు విషయంలో పోలీసు వారు చేయదగిన అంశాలు.
·         Rule 4 (2) ప్రకారం లైంగిక వేదింపులకు సంబంధించి ఫిర్యాదులను పోలీస్ అధికారులు నమోదు చేసుకొని విచారణ చేపట్టాలి. లేదా జరిగినట్లు ఆరోపణలు అందిన వెంటనే ఆ బాదితులను సందర్శించి వారి ఫిర్యాదులను తీసుకోనవలయును.
(Section 21 (1) ప్రకారం ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయకున్నా లేదా పై అధికారుల దృష్టికి తేకున్నా 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా లేదా రెండూ విధించవచ్చును.)
·         Section 19 (2) ప్రకారం ప్రతి కేసు తప్పనిసరిగా జనరల్ డైరీ నమోదు చేయవలయును
·         Section 19 (2) ప్రకారం జనరల్ డైరీ లో నమోదు చేయబడిన కేసు పూర్తి వివరాలు తప్పక చూడవలెను. రిజిస్టరులో నమోదు చేయవలయును.
·         Rule 4 (a) చట్టప్రకారం FIR ను రూపొందించి, తగిన సెక్షన్లు నమోదు చేయవలయును.
·         Rule 4 (2)(a) FIR కాపీని ఉచితంగా ఫిర్యాదీకి అందించాలి.
·         Cr. Pc. 164 (a)  ప్రకారం వెంటనే వైద్య పరీక్షలు అందించాలి.
·         Section 19 (5) ప్రకారం CWC కి తెలియపరచి ఆదేశాల మేరకు రక్షిత గృహానికి తరలించాలి.
·         Section 24 (1) ప్రకారం బాదిత బాలలను పోలీస్ స్టేషనుకు తీసుకు రాకూడదు వారి ఇంటివద్దకే వెళ్ళాలి.
·         Section 19 (6) ప్రకారం POCSO చట్టపరిధిలో నమోదు చేయబడిన కేసులను 24 గంటలలోపుగా CWC ముందుకు తప్పక తీసుకురావలయును.
·         Section 24 (1) ప్రకారం ఎస్. ఐ. లేదా అంతకంటే పై అధికారి మాత్రమే ఈ చట్టం క్రింద నమోదు చేయబడిన కేసులను దర్యాప్తు చేయాలి.
·         Section 24 (2) యూనీఫారం ధరించరాదు.
·         Section 24 (4) ఎట్టి పరిస్తులలోనైనా బాలలను పోలీస్ స్టేషన్ లో రాత్రులలో ఉంచరాదు.
·         Section 26 (4) ప్రకారం సంబందిత సహాయకుల సమక్షంలో బాలల బామ్గ్మూలాన్ని దృశ్య, శ్రవణ విధానాల్లో రికార్డింగ్ చేయవలయును. బాలల కుటింభికుల సమక్షంలోనే జరగాలి.

మరిన్ని ఇతర వివరాలకై cwcinap.blogspot.in తప్పక చూడండి.  

1 comment:

  1. Thank you so much for the grate information regarding POCSO.

    ReplyDelete