Thursday 9 July 2015

role of cwc

To,
Mr. BV. Ramana Rao,
Member,
Child Welfare Committee,
YSR KADAPA Dist.

Your Question:
Please inform us about Operation Muskaan, what is the role of CWC in the
Operation Muskaan
.
 --------------------------------------------------------------------------------
Answer:
Operation Muskaan అనేది బాలలకు సంభంచిన అంశం. ఈ అంశం భారతదేశం అంతటా వర్తిస్తుంది.  ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుపమని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత సుప్రీమ్ కోర్ట్ వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు సంభంచి Home Secretary, Government of India నుండి DO No. 15011/992014-ATC, dt. 19th. May, 2015 ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో  Director General of Police, CID, Andhra Pradesh నుండి C. No. 2501/C-71/WPC/CID/2015 dt.18-05-2015 గా అన్ని జిల్లాల పోలీస్ ఆఫీసర్లకు CIRCULAR MEMO పంపటం జరిగింది. 

ముఖ్య ఉద్దేశ్యం:
A.     ఈ ఆపరేషన్ లో షెల్టర్ హోమ్ లలో, రైల్వే ప్లాట్ ఫారాలలో, బస్టాండ్ లలో, రోడ్లపై, మత సంస్థలలో మొదలైన చోట్లలో ఉన్న బాలలను పోలీసు అధికారులు కనుగొని వారు ఎవరనేది  పరీక్షించవలయును. ఇందులో “Missing Children” గా కనుగొన్నట్లయితే Ministry of Women and Child Development వారి  ‘MISSING CHILD’ Portal లో Uploadచేయించవలయును.
B.      Missing Child గా కనుగొన్న వారి వివరాలు Print and Electronic Media లలో ప్రచురించినచో, సంభందిత కుటుంబికులు మరియు పోలీసులు బాలల వివరాలు తెలుసుకొనడం జరుగుతుంది.
కొన్ని విషయాలు:
1.      కార్యక్రమ నిర్వహణ కొరకు ప్రముఖులు  నిర్ణయాలు చేయడం జరిగింది
2.      కార్యక్రమం JJ Act, POCSO మొదలైన ఉద్దేశ్యాలతో నిర్వహించడం జరుగుతుంది.
3.      కార్యక్రమం అన్ని జిల్లాల్లో పోలీసువారి అధ్వర్యంలో  జూలై 1 నుండి 31 వరకు జరుగును.
4.      కార్యక్రమ కార్యాచరణలో NGO ల సహాయం పొందవచ్చును.
5.      Ministry of Home Affairs, Govt of India నుండి ఈ ‘ఆపరేషన్ ముస్కాన్’  లో ప్రతిభ కనపరచిన వారికి బహుమతి ప్రధానం చేయనున్నది. 
CWC పాత్ర:
పోలీసు వారు Section 32/i  of JJ Act-2000 ప్రకారం జిల్లాలోని CWC ముందు బాలలను ప్రవేశపెట్టినప్పుడు రక్షణ, సంరక్షణ ఏర్పాట్ల విషయాలలో తగిన నిర్ణయాలు చేపట్టవలయును.

No comments:

Post a Comment