Thursday 9 July 2015

role of CWC in OPERATION MUSKAN

Respected Sir

Greetings from Child Welfare Committee, Vizianagaram.

I request your good self to kindly send me the roles and responsibilities of CWC members in the programme OPERATION MUSKAN.

With regards
POOSARLA MURALI KRISHNA
MEMBER - CWC
VIZIANAGARAM
Ph 9603990979.

 ------------------------------------------------------------------
To,
Sri. PM Krishna,
Member,
Child Welfare Committee,
Vizianagaram District.

Greetings from HELP


ముఖ్యాంశాలు:
A.     Home Secretary, Government of India నుండి DO No. 15011/992014-ATC, dt. 19th. May, 2015 ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
B.      ఈ ప్రత్యేక ఆపరేషన్ జరుపమని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత సుప్రీమ్ కోర్ట్ వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు సంభంచి మన రాష్ట్రంలో  Director General of Police, CID, Andhra Pradesh నుండి C. No. 2501/C-71/WPC/CID/2015 dt.18-05-2015 గా అన్ని జిల్లాల పోలీస్ ఆఫీసర్లకు CIRCULAR MEMOపంపటం జరిగింది.
C.      Operation Muskaan అనేది బాలలకు సంభంచిన అంశం. ఈ అంశం భారతదేశం అంతటా వర్తిస్తుంది.
D.     ఈ ఆపరేషన్ లో షెల్టర్ హోమ్ లలో, రైల్వే ప్లాట్ ఫారాలలో, బస్టాండ్ లలో, రోడ్లపై, మత సంస్థలలో మొదలైన చోట్లలో ఉన్న బాలలను పోలీసు అధికారులు కనుగొని వారు ఎవరనేది  పరీక్షించవలయును. ఇందులో “Missing Children” గా కనుగొన్నట్లయితే Ministry of Women and Child Development వారి  ‘MISSING CHILD’ Portal లో Uploadచేయించవలయును.
E.      Missing Child గా కనుగొన్న వారి వివరాలు Print and Electronic Media లలో ప్రచురించినచో, సంభందిత కుటుంబికులు మరియు పోలీసులు బాలల వివరాలు తెలుసుకొనడం జరుగుతుంది.
F.      కార్యక్రమ నిర్వహణ కొరకు JJ Act, POCSO మొదలైన ఉద్దేశ్యాలతో ప్రముఖులు  నిర్ణయాలు చేయడం జరిగింది
G.     అన్ని జిల్లాల్లో పోలీసువారి అధ్వర్యంలో  NGO ల సహాయంతో  జూలై 1 నుండి 31 వరకు జరుగును.
H.     Ministry of Home Affairs, Govt of India నుండి ఈ ‘ఆపరేషన్ ముస్కాన్’  లో ప్రతిభ కనపరచిన వారికి బహుమతి ప్రధానం చేయనున్నది

CWC పాత్ర:
1.    Special Juvenile Police Unit (SJPU) వారితో సంబందిత Operation విషయాలపై చర్చించవలయును.
2.    DPO/DCPU లను కార్యక్రమం పట్ల అప్రమత్తం చేయవలయును.
3.    Section 32/i of JJ Act-2000 ప్రకారం బాలలను CWC ముందు ప్రవేశపెట్టమని పోలీసు వారికి తెలియజేయవలయును
4.    అవసరమైతే CWC సభ్యులు అన్ని సమయాలలో అందుబాటులో ఉండుటకు సభ్యుల మద్య చర్చ జరిపి, అందుబాటులో ఉండాలి.
5.    రక్షణ, సంరక్షణ ఏర్పాట్ల కొరకు అవసరమైతే NGO ల సహాయం పొందవచ్చును.
6.    ఈ ఆపరేషన్ ప్రకారం బాలల  విషయాలను Print & Electronicపద్ధతి లో ప్రచురించేటప్పుడు JJ Act Section 21 (Sec. 21 Amendment 15 of 2006)  లను అనుసరించాలి.
7.    WD& CDA నుండి G.O. Ms. No. 30 ప్రకారం Children Homeలలోని బాలల విషయాలు Portal లో పెట్టమని చెప్పవచ్చును.
8.    బాలికల విషయంలో మహిళల నుండి సహాయం అందేలా చేయవలయును.
9.    ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బాలలను పంపుటకు ప్రత్యేకESCORT లను ఏర్పరచమని SJPU వారికి తెలియజేయవలయును.
10.  పలు రకాల Child Protection విషయాల కొరకు సంబంధించి SOP లను పరిశీలించవచ్చును.

No comments:

Post a Comment