Wednesday, 8 July 2015

prevention of Abuse

టూ
శ్రీ. ఎం.బెంజిమేన్,
సభ్యులు,
బాలల సంక్షేమ కమిటీ,
ప్రకాశం జిల్లా.

మీరు మైనరు బాలిక గురించ తెలియజేసిన వివరాల ప్రకారం. ఒక ప్రాంతం లో ఒక మైనరు
బాలిక పై వేదింపులు జరిపినప్పుడు ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
చేయించవచ్చును. మీరు చెప్పిన విషయాల ప్రకారం ఈ కేసు POCSO గా బుక్ చేయమని
పోలీసు వారిని ఆదేశించవచ్చు. POCSO Rule 4 (2) ప్రకారం లైంగిక వేదింపుల పై
వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు నమోదు చేసుకుని విచారణ చేపట్టాలి లేదా
జరిగినట్లు ఆరోపణలు అందిన వెంటనే ఆ బాదితులను సందర్శించి వారి ఫిర్యాదులు
తీసుకొనవలయును. ఫిర్యాదు అందుకొన్న వెంటనే కేసు నమోదు చేయకున్నా లేదా పై
అధికారుల దృష్టికి తీసుకుని రాకున్నా Section 21 (1) ప్రకారం 6 నెలలు జైలు
శిక్ష లేదా జరీమాన విధించవచ్చును.   కేసు FIR గా మారకపూర్వం కేసు పూర్వాపరాలు
తెలుసుకోండి, Evidences ఉన్నట్లయితే జాగ్రత్త పరచండి, అవి కేసును బలపరచడమే కాక
Accused Person కు శిక్ష పడేలా చేస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమనగా,  బాలిక పై
జరిగిన వేదింపుల వివరాలు Cr. Pc. 164 (5) ప్రకారం statement recording చేయండి.
Statement Recording సమయంలో CWC లేదా DCPU ల  నుండి ఒక మహిళా మెంబరు చే విషయాలు
సేకరించేలా ప్రయత్నం చేయండి. Statement లో తేదీ, స్థలాలు, వ్యక్తులు,
వస్తువులు, వగైరా విషయాలు తప్పక ఉండేలా చూడండి, బాదిత బాలిక  బాష, ఉచ్చారణ లను
యధాతధంగా ఉండేలా చూడండి.మీరు జరిపే ఈ Statement Recording గొప్పదని, ముఖ్యమని
భావించండి. Cr. Pc. 164 (A) ప్రకారం బాదితులను వెంటనే వైద్య పరిక్షలకు
పంపించాలి. Police Station లో FIR బుక్ అయిన అనంతరం ఒక కాపీని బాదితురాలికి
అందేలా చేయండి.  ఇతర విషయాలకు POCSO చట్టం 2012 లను పరీక్షించండి.

కృతజ్ఞలతో......
సేవలో ......
HELP, Ongole.

No comments:

Post a Comment