From: [mail from:kadapacwcramana@gmail.com]
Sent: Tuesday, January 6, 2016 10:13 AM
To: helpap@gmail.com
Subject: CWC Role in Trafficking cases.
Sent: Tuesday, January 6, 2016 10:13 AM
To: helpap@gmail.com
Subject: CWC Role in Trafficking cases.
హెల్ప్ వారికి కడప చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుండి నమస్కారం,
గతంలో మీ నుండి పలు విషయాలను బ్లాగ్ ద్వారా పొంది బాలలకు మా జిల్లాలో సహాయ
కార్యక్రమాలు చేపట్టాము.
ప్రస్తుతం మా జిల్లాలో Trafficking case వచ్చినప్పుడు Child Welfare Committee ఎలా స్పందించాలో దయచేసి వివరించగలరు.
Thanking
you,
Ramana Rao,
Member,
CWC- YSR Kadapa District.
గౌరవ మెంబరు
గారికి నమస్కారం.
బాలలు Trafficking
నకు గురి కాబడినప్పుడు Child Welfare Committee చేయదగిన
విషయాలు ఈ క్రింద విధంగా తెలియజేయబడినాయి
దయచేసి పరిశీలించండి.
Child Welfare Committee ముందు బాలలను ప్రవేశపెట్టినప్పడు.
1.
Child Welfare Committee వారు బాలలతో మాట్లాడి వారి యొక్క అభిప్రాయం మరియు అనుభవాలు తెలియజేయుటకు తగిన ప్రోత్సాహకాన్ని అందించవలయును.
2.
Child Welfare Committee వారు బాలలకు
తాత్కాలిక వసతి కల్పించుటకు ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థలకు తగిన ఆదేశాలు జారీ
చేయవలయును.
3.
Child Welfare Committee ముందు బాలలను
ప్రవేశపెట్టినప్పుడు అవసరమైతే వైద్య పరీక్షల నిమిత్తం ఆదేశాలను జారీ చేయవలయును.
ప్రభుత్వ
లేదా ప్రభుత్వేతర సంస్థల వసతి గృహములలో : ( At Govt & Non Govt
Homes)
1.
వసతి గృహ సిబ్బంది సదరు బాలలకు
జరగాల్సిన వైద్య పరీక్ష మరియు వయస్సు నిర్దారణ పరీక్షలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో
జరిగేటట్లు చూడవలయును.
2.
బాలలతో మాట్లాడటం ద్వారా వారి కుటుంభ
చిరునామాను తెలుసుకొని, వారి సహాయం తోనే ఆ చిరునామాను కనుగొనే ప్రయత్నం చేయాలి.
3.
బాలలతో చర్చించి తద్వారా వారి
వ్యక్తిగత రక్షణ ప్రణాలికలను తయారుచేసి అమలు పరచడం.
గృహ
విచారణ విషయంలో: ( Home Inquiry Report):
1.
DCPU లేదా NGO ల ద్వారా కుటుంబాన్ని
కనుగొని సందర్శించి విచారణ సేకరించాలి.
2.
బాలలు అదే జిల్లాకు చెందినవారైతే అదే
జిల్లా వారితో విచారణ చేపట్టాలి.
3.
కుటుంబాన్ని ఇతర విషయాలను విశ్లేషించి
తగిన నివేదికను తయారుచేసేలా చేయాలి.
4.
Home Inquiry Report సహాయాల కొరకు DCPU
లేదా NGO ల సహాయం పొందవచ్చును.
పోలీసు
సహకారం:
1.
FIR, Charge Sheet నమోదు చేయుటలో
ఆలస్యం చేయకుండా తగు జాగ్రత్త కొరకు Child Welfare Committee
ఆదేశాలు జారేచేయవలయును.
2.
Child Welfare Committee వారు FIR
కాపీలను Charge Sheet కాపీలను పొందవలయును.
Home Inquiry
Report అనంతరం రిపోర్టును పరిశీలించి బాలలను తమ ఇంటికి పంపే క్రమంలో మరియు ఫిట్
పర్సన్ గా ఉన్నట్లయితే బాండు ను తీసుకొని ఇంటికి పంపవచ్చును. బాలలు ఇతర దేశం లేదా
రాష్ట్రం లేదా జిల్లా వారు అయితే బదిలీ లేదా పునరేకీకరణ కొరకు ఆర్డరు జారీ
చేయవలయును. కుటుంభం లేకపోయినప్పుడు Sponsorship, Poster Care అవకాశాలు
అందించవచ్చును.
No comments:
Post a Comment